ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం… పక్కా ఇళ్ళ కోసం 500 కోట్లు

ఎన్నికలు దగ్గరకి వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించింది. ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూముల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2019 జనవరి నాటికి 19 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే పలు పట్టణాల్లో 71862.. గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలా 19వేలా 696 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించింది.. ఇవికాక మరో 17వేల మందికిపైగా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి.. అయితే, అర్హులందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. అయితే, ఇప్పటికే బడ్జెట్‌లో 500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసి అర్హులకు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 10 అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ పరిధిలో ఉన్న గ్రామాల్లో అవసరమైన చోట్ల బహుళ అంసత్థుల ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here