జగన్, పవన్.. లు రాష్ట్రం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు పై బురదజల్లుతున్నారు

ప్రకాశం జిల్లా చీరాలలో మంత్రి లోకేష్ పర్యటించారు.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. గ్రామంలో చేనేత కార్మికులతో లోకేష్‌ ముఖాముఖి అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్హులైన చేనేతలకు పెన్షన్లు అందజేశారు. అనంతరం రామాపురంలో సిమెంటు రోడ్లు, ఫిష్‌ ట్యాంక్‌, ఫార్మ్‌ పాండ్లకు లోకేష్ శంకుస్థాపన చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…బీజేపీ, వైసీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఓ డ్రామా కంపెనీ అన్న ఆయన.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కర్నాటక ఎన్నికలు బీజేపీకి ట్రైలర్‌ మాత్రమేనని.. 2019 ఎన్నికల్లో తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. అంతేకాదు.. ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని మోడీని జగన్‌, పవన్‌ ఒక్కసారైనా ప్రశ్నించలేదని.. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపిస్తున్న వారు.. దమ్ముంటే సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వం ఒక్క టీడీపీనే అన్నారు. జిల్లా పర్యటనలో లోకేష్‌ వెంట మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here