ఫెమినా మిస్ ఇండియగా తమిళ పొన్ను.. సెకండ్ రన్నరప్ గా తెలుగమ్మాయి

నిన్న అర్ధరాత్రి ముంబైలో అత్యంత అట్టహాసంగా జరిగిన ఫెమినా మిస్ ఇండియా- 2018 ఫైనల్స్ లో
చెన్నై కి చెందిన అనుకృతి‌వాస్ ఫెమినా మిస్ ఇండియా- 2018 గా ఎమ్పికైయ్యారు. మొత్తం 29+1 మంది ఫైనలిస్టులను ప్రక్కకు తోసి ఈ చెన్నై సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. మిస్ ఇండియా-2018 కార్యక్రమంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్… ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని అనుకృతివాస్‌కు ధరింపజేశారు. ఈ అందాల పోటీలో హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి ఫస్ట్ రన్నరప్‌గా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయ సెకెండ్ రన్నరప్ గా నిలిచారు.
ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ మరియు నటుడు ఐశుమన్ కురాన నిర్వహించారు. ఈ పోటికి న్యాయ నిర్ణేతలుగా మాజీ మిస్ ఇండియా మానుషి చిల్లెర్ , క్రికెటర్స్ KL రాహుల్, ఇర్ఫాన్ ఫతాన్, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్, మల్లికా అరోరా, ఫాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా మరియు విలేఖరి ఫయే డి సౌజా వ్యవహరించారు.
అనుకృతి క్రీడాకారిణిగా, డాన్సర్‌గా పేరొందారు. చెన్నైలోని లొయోల కళాశాలలో ఫ్రెంచ్ భాషలో బీఏ చదువుతున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2018 గా ఎంపికైన అనుకృతి‌వాస్ ఈ ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు ప్రపంచ సుందరి పోటీల్లో ఇండియా తరపున పాల్గొంటారు.

………. సంధ్యా రవి ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here