రిజర్వేషన్ల అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు

ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో సిఎం చంద్రబాబు నాయుడు అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు.. వాటిలో ఒకటి.. వివిధ సామాజికవర్గాల రిజర్వేషన్‌ మార్పులకు వస్తున్న డిమాండ్లపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భూములకు పరిహారంపైనా కేబినెట్‌లో చర్చించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఏపీ భవన్‌లో జాయింట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్ల భర్తీకి కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే డెంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌ యాక్ట్‌ 2007 రద్దుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 11వ వేతన సంఘానికి తాత్కాలిక ప్రాతిపదికన 16 పోస్టులు మంజూరు చేస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here