శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతి విశిష్టత ఏమిటో తెలుసా..!!

ఈ ఏడాది శ్రీసప్తముఖ కాలసర్ప మహాగణపతి గా కోలువదీరనున్న ఖైరతాబాద్‌ గణపతి కి ఎన్నో విశిష్టతలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. శాంత చిత్తంతో ఉన్న ఏడు గణపతి ముఖాలు, 14 చేతులు అందులో కుడి వైపు ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధతో కూడి ఆశీర్వదిస్తుండగా, ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉంటాయి. 57 అడుగుల గణపతికి మరో మూడు అడుగుల ఎత్తులో ఏడు తలల శేషుడు తన పడగతో నీడ కల్పిస్తాడు. వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి. గత ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రెండు వైపులా చిరు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు.
గణేశుడికి కింద నుంచి కుడి వైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ దేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లు ఆశీనులై ఉంటారు. పాదల వద్ద వినాయకుడి వాహనం ఎలుక స్వామి వారికి భజన చేస్తూ కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here