కన్నడ లో పానీపూరి తెలుగులో ‘స్మగ్లర్’

కన్నడలో ‘పానీపూరి’ పేరుతొ విడుదలై మంచి విజయం సాధించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘స్మగ్లర్’ పేరుతొ అనువదిస్తున్నారు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ పతాకంపై త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో వైభవ్, జగదీశ్, సంజయ్, అను, అక్షత, దర్శిత యోగేష్ ముఖ్య పాత్రలు పోషించారు. నవీన్ కుమార్ కె.ఫి దర్శకత్వం వహించారు. ‘సంతొష్ బాగల్కోట్ సంగీతం సమకూర్చారు.
భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండే యూత్ ఫుల్ మూవీ ఇది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సెన్సార్ ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము’ అన్నారు.
ఈ చిత్రానికి గ్రాఫిక్స్: శ్రీనిధి డిజిటల్స్, పబ్లిసిటీ డిజైనర్: వెంకట్.ఎం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here