కృష్ణా డెల్టాకు నీటిని రిలీజ్ చేసిన చంద్రబాబు

దేశంలోనే నదుల అనుసంధానంను తొలిసారిగా చేసి ఘనత వహించిన చంద్రబాబు జూన్ లోనే కృష్ణా డెల్టాకు నీటిని రిలీజ్ చేశారు. కృష్ణాడెల్టా తూర్పు కాల్వకు పట్టిసీమ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 2 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. 7 లక్షల 36 వేల 537 ఎకరాల సాగు భూమికి తూర్పు డెల్టా కాల్వ ద్వారా నీరు అందనున్నది. నీటి విడుదల సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆ తరువాత కృష్ణాడెల్టా హెడ్‌ వర్క్స్‌ని ప్రారంభించారు..
గతేడాది నీటి మళ్లింపు తో కృష్ణా డెల్టాలో 100 ఎకరాలు సాగు అందుబాటులోకి వచ్చింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా చివరి ఆయకట్టుకు, ఆక్వా సాగును నీరు లభ్యమవుతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here