క్యాన్సర్ బాధిత యువతిని కలిసిన మెగా హీరో తేజు

తమను ఎంతగానో అభిమానించే అభిమానికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. ఇటీవల హీరోలు స్పందించి తమ వంతు సాయం అందిస్తున్నారు.. బాధితులకు తాము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరం తేజ్ తన సినిమా తేజ్ ఐ లవ్ యు ప్రమోషన్ లో పాల్గొని.. విశాఖ నుంచి హైదరాబాదు కి తిరుగు పయనం అయ్యారు.. విమానాశ్రయం వద్దకు చేరుకోగానే… కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బంగారమ్మ అనే యువతి తేజు ని పలకరించింది.
పాండ్రంగి గ్రామానికి చెందిన బంగారమ్మ అనే యువతి బోన్‌కేన్సర్‌తో బాధపడుతోంది.. వైద్యుని ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఓ కాలు తీసేశారు.. ఇటీవల టెన్త్‌లో 8.5 గ్రేడ్‌ సాధించింది.. ఆమె పరిస్థితి తెలుసుకున్న కొందరు ఆమెకు అండగా నిలబడ్డారు. అయితే తన అభిమాన హీరో వచ్చారని తెలుసుకున్న బంగారమ్మ తెజుని కలవాలనుకుంది.. ఈ విషయం తేజు చెవిన పడింది.. వెంటనే తన అభిమానులకు చెప్పి బంగారమ్మ ను విమానాశ్రయం వద్దకు పిలిపించి కలిశారు.. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని.. అన్నివిధాల అండగా ఉన్న రామును కూడ అభినందించారు.. బంగారమ్మ ఆరోగ్యం బాగా కుదుటపడాలని మెగా అభిమానులందరితో పాటు… విషయం తెలిసిన వారందరూ మనస్పూర్తిగా దేవుడిని ప్రార్ధించాలని తేజు చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here