కీలక సన్నివేశాల చిత్రీకరణలో సైరా..!!

ఎవరి అండా లేకుండా స్వయం కృషి తో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. కొంత కాలం గ్యాప్ తీసుకున్న చిరంజీవి 150 వ సినిమా గా ఖైదీ నెంబర్ 150తో వెండి తెరపై అడుగు పెట్టాడు. తాజాగా సైరా సినిమాలో బిజీగా ఉన్నాడు.

తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రఆధారంగా ఈ సినిమా తెరకేక్కనున్నది. ప్రస్తుతం ‘సైరా’ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులోనే కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణ స్పెయిన్ నుండి వచ్చిన యాక్షన్ కొరియోగ్రఫర్ల పర్యవేక్షణలో జరుగుతోంది. నిన్న తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ షూట్ జరిగింది. ఈ షూట్లో చిరు చాలా ఉత్సాహాంగా పాల్గొని, యాక్షన్ సన్నివేశాలను విజయవంతంగా పూర్తిచేసినట్టు సమాచారం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.. అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్ తదితర భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా 2019 వేసవి కానుకగా రిలీజ్ కానున్నది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here