తెరాస కు పగడాల కరుణాకర్‌రెడ్డి రాజీనామా

టీఆర్‌ఎస్‌ మాజీ మండల కన్వీనర్‌ పగడాల కరుణాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పగడాల విలేకరులతో మాట్లాడుతూ… నా రాజీనామా లేఖను రెండురోజుల క్రితమే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, అలాగే జిల్లా అధ్యక్షుడికి పోస్టు ద్వారా పంపినట్టు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించటమే కాక, మండలంలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఈమధ్యకాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను తనకు సరిపడక తెరాస పార్టీకి రాజీనామా చేశానని, త్వరలో తెలంగాణ జనసమితిలో చేరనున్నట్టు ఈసందర్భంగా ఆయన తెలిపారు. ఐతే జనసమితి నుంచీ MLA ఆభ్యర్దిగా పోటీ కి సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here