ఫిఫా ప్రపంచ కప్ 2018 గ్రూప్ A నుంచీ సౌదీఅరేబియా, ఈజిప్ట్ ఔట్.

గ్రూప్ A లో ఫేవరెట్ గా అడుగు పెట్టిన ఈజిప్ట్ ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో ఓడిపోయు ఇంటిదారి పట్టింది. దీనితో ఫిఫా ప్రపంచకప్‌ నాకౌట్లో అడుగుపెట్టిన తొలి రెండు జట్లుగా ఉరుగ్వే, రష్యా నిలిచాయి. బుధవారం సౌదీ అరేబియాను ఉరుగ్వే ఓడించడంతో గ్రూప్‌-ఎ ఫలితం తేలిపోయింది. గ్రూపులో అన్ని జట్లూ రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. రెండింటికి రెండూ గెలిచి ఉరుగ్వే, రష్యా తుది-16లో ప్రవేశించాయి. గ్రూప్ A అగ్రస్థానం కోసం ఇంకో పోటీ జరగాల్సి ఉంది.. సోమవారం జరిగే ఉరుగ్వే, రష్యా మధ్య మ్యాచ్‌లో గెలిచే జట్టు Aగ్రూప్‌ విజేతగా నిలుస్తుంది.

ప్రపంచకప్‌నకు ముందు ఆతిధ్య జట్టు రష్యాకు ఏడు వరుస పరాజయాలు. ప్రేపెరేషన్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటలేదు. కాని సొంతగడ్డ మీద జరుతున్న టోర్నీలో ఆట మొదలవగానే ఒక్కసారిగా రెచ్చిపోయు. సొంత అభిమానుల మద్దతుతో,తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రష్యా రెండు వరుస విజయాలతో ప్రపంచకప్‌ నాకౌట్‌ దశకు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో రష్యా 3-1తో ఈజిప్ట్‌పై విజయం సాధించింది. రష్యా తరఫున చెరిషెవ్‌, జుబా చెరో గోల్‌ కొట్టారు. సెల్ఫ్‌ గోల్‌ కూడా రష్యాకు మేలు చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈజిప్ట్‌ 45వ ర్యాంకులో ఉండగా.. రష్యాది 70వ స్థానం. గ్రూప్ A ఫేవరెట్ గా అడుగు పెట్టిన ఈజిప్ట్ కి రష్యా దూకుడుతో వరుస రెండు పరాజయాలతో ఇంటిదారి పట్టక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here