యోగా తోనే మనశ్శాంతి …… నరేంద్రమోడి

ఈరోజే ప్రపంచ యోగా దినం.
“యుజ్” అనే సంస్కృత ధాతువు నుండి “యోగ” లేదా “యోగము” అనే పదం ఉత్పన్నమైంది. “యుజ్” అనగా “కలయిక”. “యుజ్యతేఏతదితి యోగః”, “యుజ్యతే అనేన ఇతి యోగః” వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము –
యోగా ప్రతి మనిషి జీవితంలో శాంతి అనుభూతిని కలుగజేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ . అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో నరేంద్రమోడి అన్నారు.. ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగాకు ముఖ్యకేంద్రంగా వర్ధిల్లుతోందని, ఉత్తరాఖండ్‌ యోగా, ఆయుర్వేదిక్‌ కేంద్రంగా అభివ్రుద్దిపదంలో వుందని అన్నారు. సూర్య కిరణాలు అన్ని దిశలలో పయనిస్తున్నవిధంగా , నేడు ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు.

padmasanam

డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అందరూ యోగా జపం చేస్తున్నారని అన్నారు. కుటుంబం, సమాజంలో యోగా సద్భావన కలిగిస్తుందని అన్నారు . అతి తక్కువ కాలంలో యోగా ప్రపంచ వ్యాప్తమైందని, యోగాను భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. ఈరోజు జరుగుతున్న యోగా దినోత్సవం అతిపెద్ద సామూహిక ప్రజాహిత కార్యక్రమమని మోడీ తెలిపారు. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
నరేంద్రమోడి యోగాకు ప్రపంచస్థాయు గుర్తింపు తీసుకువచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here