ఆధార్ లేకుండా సిమ్ కార్డు తీసుకోవచ్చు తెలుసా..!

ఇప్పటి వరకూ ఆధారే అన్నింటికీ ఆధారం.. అని ప్రభుత్వం చెప్పింది.. సిమ్ కార్డు కొనుగోలు చేయలన్నా ఆధార్ లేదా రేషన్ కార్డులను ప్రూఫ్ గా టెలికాం తీసుకుంటుంటున్నాయి. అయితే ఇక నుంచి ఇక కొత్త సిమ్ కొనాలంటే ఆధార్ నెంబర్‌తో పనిలేదంటోంది టెలికం శాఖ… స్యయంగా టెలికాం శాఖ

సిమ్‌ కార్డుల నుంచి పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, గ్యాస్… ఇలా అన్నింటికీ ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటూ ఆదేశాలు వచ్చినా… అవసరంలేదంటూ కోర్టు తీర్పులు వెలువడ్డాయి. మరోవైపు ఆధార్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది టెలికం శాఖ. ఆధార్ నెంబర్ స్థానంలో వర్చువల్ ఐడీగా పిలిచే నెంబర్‌ను నంబర్‌తో సిమ్ పొందవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ… టెలికం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీనిని అమలు చేసేందుకు టెలికం ఆపరేటర్లు సిద్ధమవుతుండగా… జూలై 1వ తేదీ నుంచి ఈ పద్ధతి అందుబాటులోకి రానుంది. ఆధార్‌ నెంబర్ ద్వారా వర్చువల్ ఐడీలో నెంబర్ పొందవచ్చు. యూఐడీఏఐ సైట్‌లో వర్చువల్ ఐడీ నంబర్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

వర్చువల్ ఐడీ లాగిన్ కోసం… ముందుగా httph://uidai.gov.in లో ఆధార్ ఆన్ లైన్ సర్వీసెస్ సర్వీస్ విభాగంలో ఆధార్ సర్వీసెస్ లో వర్చువల్ ఐడీ జనరేట్ ను ఎంచుకోవాలి…

కొత్తగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ నెంబర్, సెక్యురిటీ కోడ్ లను పూరిస్తే… మొబైల్ నెంబర్ కు ఒటిపి వస్తుంది.
ఆ తర్వాత అదే పేజీలో ఒటిపి ని ఎంటర్ చేసి జనరేట్ వర్చువల్ ఐడీ అనే బటన్ ను క్లిక్ చేసి ఎంటర్ బటన్ ను నొక్కాలి
ఆ వెంటనే మొబైల్ నెంబర్ కు వర్చువల్ ఐడి వస్తుంది
వర్చువల్ ఐడీ ను మర్చిపోకుండా ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది.. ఒకవేళ మరచిపోయినా మళ్ళీ పొందే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here