దిగివస్తున్న బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. డాలరు గరిష్టానికి చేరడంతో పుత్తడి వెనుకంజ వేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలపడుతున్న కారణంగా బంగారం ధర దిగి వస్తోందని బులియన్‌ ట్రేడర్ల విశ్లేషణ. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తాజాగా ఆరు నెలల కనిష్టానికి చేరింది. ఇటు దేశీయంగానే ఇదే ధోరణి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్షీణించడంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 30,650 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ రూ.136 నష్టంతో రూ. 39,490కు చేరింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here