మంత్రి గంటా ఇంటికి రాయబారిగా చినరాజప్ప

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలక కొనసాగుతోంది. రాయబారం కోసం హోంమంత్రి చిన్నరాజప్ప మంత్రి గంటా ఇంటికి చేరుకున్నారు. చర్చల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు ఫోన్‌లో ఐదు నిమిషాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పంచకర్ల, పల్లాతో పాటు పలువురు నేతలు రాజప్పతో వున్నారు. ప్రస్తుతం గంటాతో మంతనాలు ఇంకా కొనసాగుతున్నాయి.

మంత్రి గంటా శ్రీనివాసరావు అలక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పార్టీలోని కొంతమంది వ్యవహార శైలిపై కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న గంటా శ్రీనివాసరావు… నిన్న కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. గంటా తీరు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే ఇటీవల మీడియాలో గంటాకు వ్యతిరేకంగా సర్వేలు వస్తున్నాయి. బీమిలిలో టీడీపీ ఓడిపోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనక సొంత పార్టీ నేతలే ఉన్నారన్న భావన గంటాలో నెలకొంది. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సర్వేల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఓటమి లేకుండా వరుస విజయాలతో వెళుతున్న తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తెరవెనక కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here