అధిష్టానాన్ని కలవర పెడుతున్న నాయకుల మధ్య వర్గపోరు

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు. వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలున్నా.. నాయకులంతా కలిసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తారు. కానీ.. రాజమహేంద్రవరంలో తెలుగు తమ్ముళ్లు తలోదారిలో నడుస్తున్నారు. కొన్నాళ్లుగా నాయకుల మధ్య వర్గపోరు ముదిరిపోయిందన్న వార్తలు పార్టీ అధిష్టానాన్ని కలవర పెడుతున్నాయి. తాజాగా ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశీ నవీన్‌కుమార్‌ కోసం ఏర్పాటు చేసిన అభినందన సభలో.. నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

కాశీ నవీన్‌కుమార్‌ అభినందన సభకు.. గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ మినహా టీడీపీ ముఖ్య నాయకులంతా డుమ్మా కొట్టారు. ఆహ్వాన పత్రికలో తమ పేరు లేదంటూ ఒకరు అలిగితే.. అవసరం లేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మరో నాయకుడు డుమ్మా కొట్టాడు. మంత్రి సహా ప్రధాన నాయకులంతా రాకపోవడంతో.. అభినందన సభను తూతూమంత్రంగా ముగించేశారు. రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో పాటు ఎంపీ మురళీమోహన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ, ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ హ్యాండివ్వడంతో.. టీడీపీ కార్యకర్తలకు షాక్‌ తగిలింది. రాజమండ్రి నేతల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న విభేదాలు.. ఈ కార్యక్రమంతో బయటపడ్డట్లు చర్చ జరుగుతోంది.
ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అభినందన సభకు మెయిన్‌ లీడర్లంతా డుమ్మా కొట్టడం.. టీడీపీ పెద్దలకు షాకిచ్చింది. కాశీ నవీన్‌ ఒక్క వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న కోపంతోనే.. మిగతా నేతలంతా అభినందన సభకు దూరంగా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here