శాంతి కోసం థీమ్ తో.. 150కి పైగా దేశాల్లో యోగా దినోత్సవం

శాంతి కోసం.. ఆరోగ్యం కోసం యోగా అనే థీమ్ తో ఈ సంవత్సరం యోగా డే జరుగుతుంది.. నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో యోగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 150కి పైగా దేశాల్లోనూ భారత రాయబార కార్యాలయాలు, స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో రాజ్‌పథ్‌ వద్ద ప్రధాన కార్యక్రమం సహా 8 చోట్ల నిర్వహిస్తున్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఎర్రకోట వద్ద జరుగుతున్న కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది సహా 50 వేల మంది పాల్గొన్నారు. అటు రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో రాందేవ్ బాబా ఆధ్వర్యంలో రికార్డు సృష్టించేలా యోగాసనాలు వేస్తున్నారు. 2 లక్షల మంది జనం ఈ ఆసనాల్లో పాల్గొనడం ద్వారా గత రికార్డ్ ను బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here