జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్ధి జయరాజు ఎంపిక..?

జనసేన పార్టీ లో ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ఒకరే ముఖ్య నేతగా కనిపిస్తున్నారు.. ముఖ్య నేతలు ఎక్కడ అని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నారు.. అయితే పవన్ సామాన్యుల నుంచి తన పార్టీ నుంచి పోటీకి నిలబెట్టే దిశగా ఎంపికలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. జనసేన పార్టీ నుంచి పూర్తీ స్థాయిలో పోటీ ఉండబోతున్నదని.. అన్ని స్థానాలకు తమ పార్టీ అభ్యర్ధులను పోటీకి రంగంలోకి దింపుతామని జనసేన అధినేత ప్రకటించింది.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మత్స్యకార కుటుంబానికి చెందిన యువ వ్యాపారవేత్త బర్రే_జయరాజు ని (99513 88889, 99516 88889) జనసేన పార్టీ నుంచి పోటీకి ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు జనసేన టిక్కెట్ ఖరారయినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాన్ని ఈ నెలాఖారులోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here