పవన్ కంటికి సర్జరీ… వాయిదా..!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు.. గత కొంత కాలంగా నేను కళ్ళజోడు పెట్టుకొనేది.. ఫ్యాషన్ కోసం కాదు.. కంటికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నానని… ఎక్కువ వెలుతురు చూడలేక పోతున్నానని పవన్ పలు సందర్భాల్లో చెప్పాడు.. తాజాగా పవన్ కళ్యాణ్ కంటికి సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఐ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న ఆయనకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పవన్ రాజకీయ బస్ యాత్రను నిర్వహిస్తూ.. ఉత్తరాంధ్రను చుట్టేస్తున్నారు.. రంజాన్ సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాన్ కు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యలు వివిధ టెస్టులు నిర్వహించారు. సర్జరీ చేయాలని సూచించారు. త్వరలోనే ఆయనకు సర్జరీ నిర్వహించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వైజాగ్ నుంచి ఈ నెల 26న మళ్లీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here