10 నినిమిషాలకు రూ.20 లక్షలు అందుకున్న రకుల్

ప్రార్ధన ఇక్కడ ప్రతి రూపాయి కౌంట్ అంటూ.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీతి సింగ్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ.. బిజీగా ఉన్నది పంజాబీ సుందరి.. ఓ వైపు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నా అవకాశం దొరికితే చాలు.. అందాల ప్రదర్శనతో స్టేజ్ షోస్‌లో లైవ్‌లో తళుక్కున మెరుస్తోంది. ఇటీవల గా హైదరాబాద్‌లో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అందాల భామ మెరుపు డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. తన ఆట పాటలతో ఈ షోని ఓ రేంజ్‌లో రక్తికట్టించింది. ఈ అమ్మడి 10 నిమిషాల ప్రదర్శనకు భారీ ఎత్తున డబ్బు సమర్పించుకున్నారట నిర్వాహకులు. ఈ డ్యాన్స్ కోసం అందాల రకుల్‌కి ఏకంగా రూ. 20 లక్షల పారితోషికం అందుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here