గురుకుల డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కళాశాలలో 863 ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను ఆర్‌ఈఐ-ఆర్‌బీ అధ్వర్యంలో భర్తీ కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్, జిల్లా అంశాలతోపాటు రోస్టర్‌ పాయింట్లు, అర్హతలను నిర్ణయించి పోస్టులను భర్తీ చేయాలని సూచించారు..

పోస్టుల వివరాలు: ప్రిన్సిపాల్‌ 15, లెక్చరర్‌ 616, లైబ్రేరియన్‌ 15, ఫిజికల్‌ డైరెక్టర్‌ 15, మెస్‌ మేనేజర్‌/వార్డెన్‌ 15, స్టాఫ్‌నర్సు 31, కేర్‌ టేకర్‌ 15, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 62, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ 31, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ 22, జూనియర్‌ అసిస్టెంట్‌ 11, స్టోర్‌ కీపర్‌ 15.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here