ఈనెల 30న అనంతపురంలో వంచన దీక్ష : బొత్స

ఏపీ రాజకీయాలు రోజుకి రకరకాల దీక్షలతో హీట్ ఎక్కిస్తున్నాయి… ఇప్పటికే ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర తో ప్రజల మధ్య ఉంటె.. పవన్ బస్ యాత్ర చేపట్టారు.. ఇక మంత్రి లోకేష్ వివిధ జిల్లాల పర్యటనతో ప్రజల మధ్య ఉన్నారు.. కాగా వైసిపీ వంచన దీక్ష మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ దీక్షలో భాగంగా ఏపీ ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంచించాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ, బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా ఈనెల 30న అనంతపురంలో వంచన దీక్ష నిర్వహిస్తున్నట్టు బొత్స తెలిపారు. బీజేపీ, టీడీపీ మధ్య చీకటి ఒప్పందాలు ఉండడం వల్లే.. చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ అనలేకపోయారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here