సమంత అక్షయపాత్రతో 100మంది చిన్నారులకు భోజనం.. అభిమానులకు పిలుపు

ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను.. అక్కినేని వారబ్బాయి చైతుని మాయలో పడేసిన సమంత.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి… స్టార్ హీరోయిన్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక హీరోయిన్ గా అలరిస్తూనే…. తన మంచి మనసు.. సాటి మనిషి పట్ల తనకున్న ప్రేమ సమాజం పట్ల తన భాద్యత ను నెరవేస్తూ.. ప్రత్యూష పౌండేషన్ పేరుతొ ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నుంచి ఎంతో మంది ఆపన్నులను సాయం అందిస్తుంది. కొన్ని నెలల క్రితం చైతు చేయి అందుకుని.. అక్కినేని వారింటి కోడలు గా అడుగు పెట్టింది. అటు కోడలిగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ.. అందరి మన్ననలను పొందుతున్న సమంత.. తోటి వారికి సాయం చేయడంలో కూడా ముందుంది. తమ కుటుంబం వంద మంది చిన్నారులకు ఈ ఏడాది మొత్తం ఒక పూట భోజనం అందిస్తున్నట్లు తెలిపింది.

‘అక్షయపాత్ర’ ద్వారా చిన్నారులకు భోజనం పెడుతున్నామని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సమంత.. తన అభిమానులు కూడా మీ వంతుగా సాయం చేయమని పిలుపునిచ్చింది. కేవలం రూ.950లతో ఒక స్కూల్ విద్యార్థికి ఏడాది మొత్తం రుచికరమైన పోషకాహారాన్ని అందించొచ్చని తెలిపింది. సమంత ఇచ్చిన పిలుపునకు అభిమానులు , ప్రముఖులు, నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here