ఎముకలు కొరికే చలిలో జవాన్లు యోగా

నాలుగవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత సైనికులు ఘనంగా జరుపుకున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ యోగాసనాలు వేసి తమ నిబద్ధతను చాటుకున్నారు. సముద్ర మట్టానికి 18 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌ ప్రాంతంలో ITBP జవాన్లు సూర్యనమస్కారాలు చేశారు. ఎముకలు కొరికే చలిలో జవాన్లు యోగా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు..

అటు ఎయిర్‌ఫోర్స్‌ పారా ట్రూపర్లు.. గాలిలోనే యోగాసనాలు వేశారు. అలాగే నావల్‌ కమాండ్‌కు చెందిన జవాన్లు యుద్ధవాహక నౌకలపై.. సబ్‌ మెరైన్లలో యోగా సాధన చేశారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని… వ్యాయామం ద్వారా అనేక రోగాలను నివారించవచ్చని జవాన్లు సందేశమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here