తిరుమల సమాచారం… కాంప్లెక్స్ నిండి బయట వేచిఉన్న భక్తులు

శుక్రవారం 22న తిరుమల తిరుపతి సమాచారం.. ఈరోజు ఉ!! 5 గంటల సమయానికి తిరుమల°:23C° – 29C°గా నమోదైనది. ఇక గురువారం రోజున శ్రీవారిని 71,064 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ భక్తులతో నిండి… సర్వదర్శనం కోసం బయట వేచియున్నారు. ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు 30 గంటల తరువాత శ్రీవారి
దర్శనానికి వెళ్ళవచ్చు. ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకొన్న వారికి 02 గంటల సమయం పడుతున్నది. నడక మార్గంలో వచ్చే భక్తులకు అలిపిరి 14 వేలు,శ్రీవారి మెట్టు 6 వేలు వద్ద దివ్యదర్శనం టోకెన్లు
జారీ చేయబడుతున్నాయి. అయితే దివ్యదర్శనం మొత్తం 20వేలు కోటా పూర్తి అయితే.. తరువాత వచ్చే భక్తులు శ్రీవారిని సర్వదర్శనం భక్తులతో కలిసి దర్శించుకోవాల్సి ఉంటుంది. దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులను ఉ: 08 గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here