సంచలన కాంబో రెడీ… ‘మెగా’ నిర్మాతతో మహేష్ బాబు సినిమా ..!

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా హీరోలతో భారీ సినిమాలు నిర్మించే అల్లు అరవింద్ ఇటీవల గత కొంత కాలంగా మీడియం బడ్జెట్ చిత్రాలను తెరకేక్కిస్తున్నాడు. అయితే మిగతా స్టార్ హీరో లతో మాత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు తీసింది లేదనే చెప్పవచ్చు.. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ సంచలన వార్త షికారు చేస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా నిర్మించడానికి ఆసక్తి చుపిస్తున్నారట. ఇటీవల కలిసిన వీరిద్దరూ ఈ విషయంపై మాట్లాడుకున్నరట.. అరవింద్ తమ బ్యానర్ లో సినిమా చేయమని అడిగిన వెంటనే మహేష్ ఒకే చెప్పినట్లు టాక్. అయితే అరవింద్ జస్ట్ ప్రతిపాదన మాత్రమే మహేష్ ముందు ఉంచారని.. ఇంకా స్క్రిప్ట్ వర్క్ కానీ.. ప్లానింగ్ కానీ జరగలేదని… నిజంగా ఈ కాంబో కనుక పట్టాలేక్కితే సూపర్ గా ఉంటుంది అని అటు సిని వర్గాలు.. ఇటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే మంచి దర్శకుడు.. స్రిప్ట్ రెడీ అయితే మహేష్ కు అరవింద్ తో సినిమా చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని కూడా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here