సెల్ ఫోన్ పేలి ఆర్థిక సంస్థ క్రాడిల్‌ ఫండ్‌ సిఐవో మృతి

సెల్ ఫోన్ పేలి పోయి మృతి చెందిన వారి గురించి విన్నప్పుడు.. చార్జింగ్ పెట్టడంలో అవగాహన లేకపోవడం వల్లనే.. ఇలా జరిగి ఉంటుంది అని అనుకున్నాం ఇప్పటి వరకూ… కానీ
మలేసియాలో ప్రముఖ ఆర్థిక సంస్థ క్రాడిల్‌ ఫండ్‌ సిఐవో నాజ్రన్‌ హసన్‌ సైతం చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి పోయి మృతి చెందారు.. ప్రస్తుతం ఇదే సంచలన వార్త అయ్యింది. మలేసియా ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థను నాజ్రన్‌ కొంతకాలంగా సమర్థంగా నడుపుతున్నారు. బుధవారం రాత్రి పడుకునే సమయంలో తన రెండు సెల్‌ఫోన్లు బ్లాక్‌బెర్రీ, హ్యువెయ్‌ ఫోన్ లను ఛార్జింగ్‌ పెట్టి పడుకున్నాడు. సడన్ గా ఫోన్లు పేలి… హసన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడుతో వచ్చిన మంటలకు బెడ్‌ మొత్తం తగలబడిపోయింది. సెల్‌ఫోన్‌ పేలి ముక్కలు ఆయన తలలోకి దూసుకెళ్లాయని.. అలాగే మంటల ద్వారా వచ్చిన పొగతో ఊపిరాడక నాజ్రన్ హసన్‌ చనిపోయాడని వైద్యులు నిర్ధారణ చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ అధికారి ఇలాంటి ఘటనలో చనిపోవడం చాలా బాధాకమని.. మలేసియా ప్రభుత్వం ఆయన మృతికి సంతాపం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here