చంద్రబాబు కృషి వల్లే పరిశ్రమలు, ఐటీ సంస్థలు వచ్చాయి : లోకేష్

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గం లో పర్యటించిన మంత్రి లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొన్నారు. ముందుగా రాళ్లబుదుగూరులో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని లోకేష్‌ హామీ ఇచ్చారు. అక్కడి నుంచి తుమ్ముసి గ్రామానికి చేరుకున్న మంత్రి.. నూతనంగా నిర్మించిన ఐటీఐ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని ధీమా వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోకుండా.. నాలుగేళ్ల పాటు కేంద్రప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ఏపీ పురపాలక, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే కియా లాంటి పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయన్నారు లోకేష్‌. త్వరలోనే రిలయన్స్‌ కూడా రాష్ట్రానికి రాబోతోందన్నారు. నిరుద్యోగ యువతకు త్వరలోనే వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here