పెద్ద కొడుకు అకిరా తో కలిసి కొత్త ఇంట్లోకి పవన్ దంపతులు

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పూర్తీ స్థాయిలో రాజకీయం పై దృష్టి పెట్టాడు. ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జనసేన అధినేత ఈరోజు విజయవాడలోని పడమట లంక లో కొత్త ఇంటికి షిప్ట్ అయ్యారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న పవన్ కళ్యాణ్ సతీసమేతంగా పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.
నిన్న భార్య పిల్లలతో హైదరాబాదు నుంచి విజయవాడ చేరుకున్న పవన కళ్యాణ్ ఈ రోజు ఉదయం నిరాడంబరంగా గృహప్రవేశం చేశారు. భార్య అన్నా తో పాటు.. తన పెద్ద కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పవన్ ఆ ఇంట్లోకి వెళ్లడం విశేషం. అనంతరం ఇంట్లో పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ దంపతులు గతంలో గుంటూరు సమీపంలోని ఖాజా వద్ద కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here