ప్రముఖ సినియర్ జర్నలిస్టు కురువృద్ధుడు నందగోపాల్ మృతి..!

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్, ఫిల్మ్ క్రిటిక్ అయిన నాదెళ్ళ నందగోపాల్ (84) మృతి చెందారు. నందగోపాల్ తొలి తరం జర్నలిస్టు మాత్రమే కాదు.. మంచి రచయిత.. కూడా అయన రాసిన సినిమాగా సినిమా అనే పుస్తకానికి భారత ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చి గౌరవించింది. జర్నలిస్ట్ లో ఏ లక్షణాలైతే ఉండాలో ‘ది ఫస్ట్ ది బెస్ట్ క్యారెక్టరైజేషన్’ ఏదైనా ఉంటే అది నందగోపాల్ అని దాసరి నారాయణ రావు నంద గోపాల్ గారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ లతో మంచి సాన్నిత్యం నందగోపాల్ గారికి ఉండేది..
సాధారణ కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి పైకొచ్చి అసాధారణ వ్యక్తులుగా చరిత్ర సృష్టించిన నాయకులు. తమ తమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ లకు అత్యంత సన్నిహితులు నందగోపాల్ గారు.. ఎన్నో అవార్డ్స్ రివర్డ్స్ అందుకున్నారు నందగోపాల్ పుణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ‘ఫిల్మ్ ఎప్రీసియేషన్’ కోర్సు చేసి జర్నలిస్టుగా అడుగు పెట్టారు. ఇరవఏళ్లకు పైగా జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హాజరైన అనుభవం ఆయన సొంతం. అంతేకాదు సెన్సార్ బోర్డు సభ్యుడి గా తోమ్మిదిన్నరెళ్ళు పనిచేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టి, మద్రాసులో డిగ్రీ చేసి, 1952లో దర్శకుడు కె. ప్రత్యగాత్మ సహాయకుడిగా ‘జ్వాల’ పత్రికతో జర్నలిస్టయ్యారు నందగోపాల్. ‘తెలుగుతెర’, ‘కినిమా’ లాంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన ఈ కురువృద్ధుడు నందగోపాల్ మృతి కి సిని ప్రముఖులు, రాజకీయ నేతలు.. పత్రికారంగం తమ సంతాపం తెలియజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here