ఇంటినుంచి బయటకు వచ్చిన యువతులే లక్ష్యంగా బెజవాడలో సెక్స్ రాకెట్… గుట్టు రట్టు

సిని పరిశ్రమలోనే కాదు.. అనేక చోట్ల వ్యభిచార గృహాలను నడుపుతూ.. అమాయక యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠా గుట్టు రట్టయింది. విజయవాడలో రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని.. ఈ ముఠా కొంతకాలంగా అరాచకాలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌ కాలనీకి చెందిన శోభారాణి.. ఈ దందాను నడిపిస్తోంది. ఆటోడ్రైవర్లతో ఒంటరి యువతులకు వల వేసి. .వ్యభిచారంలోకి దింపుతోంది. ఏడాది క్రితం ఇలా ఈ ముఠా ఉచ్చులో చిక్కిన ఓ యువతి.. తప్పించుకుని రావడంతో.. ఈ అరాచకం బయటపడింది వివరాల్లోకి వెళ్తే..
శోభారాణి.. అనే మహిళ సతీష్ అనే ఆటో డ్రైవర్ ఈ సెక్ రాకెట్ దందాకు పాల్పడుతున్నారు. రెండు నెలల కిందట ఓ మహిళను ఇలానే మోసం 20 వేలకు వేశ్యా గృహానికి అమ్మేశాడు. అక్కడి నుంచి ఆ మహిళ తప్పించుకోవడంతో విషయం బయటపడింది. విజయవాడలోని ఈ సెక్స్‌రాకెట్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆటో డ్రైవర్ తో పాటు..వ్యభిచార గృహం నిర్వహకురాలు శోభారాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నింధితులపై హ్యూమన్, ఐటిపి కింద కేసులు నమోదు చేసినట్టు ఇంఛార్జి డిసిపి నవాబ్ జాన్ తెలిపారు.

ఇష్టం లేని పెళ్లి చేశారని ఖమ్మం జిల్లాకు చెందిన ఓయువతి విజయవాడ వచ్చింది. ఆ యువతిని ట్రాప్ చేసిన ఆటో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి వ్యభిచార గృహానికి అమ్మేశాడు. ఇన్ని రోజులు వ్యభిచార గృహంలో నిర్భందించబడ్డ ఆ యువతి చివరికి తప్పించుకోవడంతో… సెక్స్ రాకెట్ బండారం బయటపడింది. తీగ లాగితే గొంక కదిలినట్టు ఆటో డ్రైవర్ తో పాటు..వ్యభిచార గృహ నిర్వహకురాలినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది యువతులను కూడా ఇలానే అమ్మేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here