గాలితో షుగర్ వ్యాధి లెవెల్స్ ను తెలుసుకోవచ్చట

షుగర్ వ్యాధి పేషెంట్స్ తమ శరీరంలోని చక్కెర స్థాయిని తెలుసుకోవడానికి ఇప్పటి వరకూ రక్త నమూనా ఇచ్చేవారు.. కాగా తాజాగా సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వారు ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయం పరిశోధన కేంద్రంలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. రోగి ముక్కు ద్వారా గాలిని ఈ పరికరంలోకి వదులుతూ చక్కెర స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ పరికరాన్ని బయో మెడికల్ విభాగాధిపతి డాక్టర్ కాంతారాజ్ సూచనలతో విద్యార్థిని నాన్సి కలిసి కనుగొన్నారు. ఈ పరికరంతో వేయి మందిని ఉపయోగించగా చాలా వరకూ ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here