రివ్యూ: జంబలకిడి పంబ

రివ్యూ: జంబలకిడి పంబ
బ్యానర్: శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్
నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధన రాజ్, షకలక శంకర్, హరితేజ, తదితరులు
ఫోటో గ్రఫీ : సతీష్ ముత్యాల
సంగీతం: గోపి సుందర్
నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాస్ రెడ్డి
రచన, దర్శకత్వం: జే.బి.మురళి (మను)
విడుదల తేది : 22 జూన్ 2018

కమెడియన్ గా నటిస్తూనే.. హీరోగా అవకాశాలు వస్తే.. అందిపుచ్చుకుని.. తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రీనివాస్ రెడ్డి తాజాగా జంబలకిడి పంబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ పేరుతొ ఇవివి సత్యనారాయణ సూపర్ హిట్ అందుకున్న నేపథ్యంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది.. మరి ఈ సినిమా ఎలా ఉంది.. శ్రీనివాస్ రెడ్డి మరో హిట్ అందుకున్నాడా.. తెలుసుకుందాం….!!

కథ: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరుణ్( శ్రీనివాస్ రెడ్డి), ఫ్యాషన్ డిజైనర్ పల్లవి( సిద్ధి ఇద్నాని) లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు.. ప్రేమికులుగా ఉన్న అవగాహన ప్రేమ.. పెళ్లి తర్వాత ఆధిపత్య పోరులో పెళ్ళైన ఏడాది లోపే ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. దీంతో విడాకులు తీసుకోవాలని భావిస్తారు.. వెంటనే ఒక లాయర్ ని సంప్రదిస్తుంటారు.. ఇటువంటి జంటలకు విడాకులు ఇప్పిమ్చడమే పనిగా పెట్టుకున్న న్యాయవాది హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని కృష్ణ మురళి) ని తమ విడాకుల కోసం సంప్రదిస్తారు. వరుణ్, పల్లవి జంటలకు విడాకులు ఇప్పిస్తే.. వంద జంటలకు విడాకులు ఇచ్చిన లాయర్ గా గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కుతానని చాలా సంతోషంతో గంతులు వేస్తాడు.. లాయర్.. ఇంతలో తన భార్య తో కలిసి లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గోవా టూర్ కి పయనం అవుతాడు.. కానీ మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగి భార్యాభర్తలు మరణిస్తారు.. వీరి ఆత్మలు పైకి వెళ్ళాక.. హరిశ్చంద్ర ప్రసాద్ ను దేవుడు రానివ్వడు.. ఎందుకు అని ప్రశ్నించగా.. నువ్వు విడగొట్టాలను కున్న వందో జంట ను కలిపి వస్తేనే.. నిన్ను నీ భార్య వద్దకు పంపుతా అని దేవుడు చెబుతాడు. అప్పుడు ఆత్మ రూపంలోకి దిగి వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ వరుణ్, పల్లవి ని కలపడానికి పడ్డ పట్లు… ఈ దంపతులపై వేసిన జంబ లకిడి పంబ మంత్రం తెరపై చూడాల్సిందే..

విశ్లేషణ: అమ్మాయి అబ్బాయి గా, అబ్బాయి అమ్మాయిగా మారడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.. ఇదే నేపథ్యం.. పండించే వినోదం తో మరోసారి దర్శకుడు ప్రేక్షకుల ముందుకు జంబలకిడి పంబ అంటూ ముందుకువచ్చాడు. అబ్బాయిలకు భర్త గా మారిన అబ్బాయిలకు ఉండే బాధ్యత తెలియాలని.. అబ్బాయిలకు.. అమ్మాయిలు భార్య గా అడుగు పెట్టక వారికుండే బరువు బాధ్యతలు తెలియాలనే ఆలోచనతో ఈ కథను రాసుకున్నాడు.. కాన్సెప్ట్ బాగుంది.. కానీ అనుకున్న పాయింట్ ను తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు దర్శకుడు అని చెప్పవచ్చు. దేహాలు మార్చి వినోదం పై దృష్టి పెట్టాడు కానీ కథనం లో ఉన్న ఆత్మని విడిచి పెట్టాడు. మొదటి అర్ధ భాగం భార్య భర్తల గొడవతో సాగితే…
సెకండ్ పార్ట్ లో కథ ముందుకు సాగలేదు.. దేహాలు మారీన తర్వ త వినోదం ఆశించిన ప్రేక్షకులకు భంగపాటు.. కలుగుతుంది.. హరిశ్చంద్ర ప్రసాద్ ఆత్మ పదే పదే తెరపై కనిపిస్తూ..,..
బోర్ కొట్టిస్తుంది.. ఇక శ్రీనివాస్‌ రెడ్డి అమ్మాయి హావభావాలతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినా చివరికి వచ్చేసరికి ఆయన నటన కూడా విసుగు తెప్పిస్తుంది. కథలో పస లేకపోవడంతో ఆయన ప్రయత్నం ఫలించలేదు. వరుణ్‌ పాత్ర ఆఫీస్‌లో, పబ్బులో చేసే సందడి శ్రీనివాస్‌ రెడ్డి హావభావాలకు, ఆయన ఇమేజ్‌కి ఏమాత్రం అతకలేదనిపిస్తుంది. కథానాయిక సిద్ధి ఇద్నానీకి ఇదే తొలి తెలుగు చిత్రమైనా చక్కటి అభినయం ప్రదర్శించింది. సంభాషణలు పలకడంలోనూ పరిణతి కనబడుతుంది. అబ్బాయి హావభావాలతో కన్పించే సన్నివేశాల్లోనూ కాన్ఫిడెంట్‌గా నటించింది. పోసాని, వెన్నెల కిశోర్‌ పాత్రలు సినిమా మొత్తం కనిపిస్తాయి. కానీ ఆయా పాత్రలతో పుట్టిన వినోదం తక్కవే. కామెడి యాక్టర్స్ చాలా మంది ఉన్నా ఎక్కడా నవ్వు పండలేదు.. ఇక సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. దర్శకుడు మను అటు వినోదంలోనూ, ఇటు భావోద్వేగాల విషయంలోనూ బలహీనమైన సన్నివేశాలతో సినిమా అల్లెసినట్లు అనిపిస్తుంది.. కానీ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి నటన, సాంకేతిక పనితనం, సంగీతం

మైనస్ పాయింట్స్ : హాస్యం ఆశించినంతగా లేకపోవడం..
చివరిగా.. నవ్వులను ఆశించి వెళ్తే… కుడి ఎడమై భంగపాటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here