దానం నాగేందర్ ఆదివారం టిఆర్ఎస్ గూటికి! ముకేష్ కూడా అదే దారిలో??

తెలంగాణలో హైదరాబాద్ నగర కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్న నగర సీనియర్‌ నేత,మాజీమంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు నిన్న రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖల ప్రతులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపినట్లు తెలిసిందే. రాజీనామా వెంటనే ఇరువైపులా జరిగిన నాటకీయ పరిణామాలు నగర కాంగ్రెస్స్ పార్టీ కి శరాఘాతంగా మారాయు. రాజీనామా లేఖ పంపిన వెంటనే దానం న్యూ యమ్ఎల్ఏ క్వార్టర్స్ లో మంత్రి తలసానితో సుదీర్ఘ మంతనాలు సాగించడంతో ఆయన తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సియం కేసీఆర్‌ సమక్షంలోనే ఆదివారం గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తెరాసలో చేరే విషయాన్ని నాగేందర్‌ స్వయంగా ఈరోజు దానం విలేఖరుల సమావేశంలో ప్రకటించే అవకాశాలున్నాయు. తన రాజీనామాపై ఫిలింనగర్‌లోని ఫిలింజంక్షన్‌లో ఈరోజు విలేకరుల సమావేశంలో దానం మాట్లాడతారని ఆయన అనుచరుల ద్వారా తెలిసింది.
ఇదిలావుంటే కాంగ్రెస్‌ను దానం వీడకుండాఉంచడానికి తెలంగాణ కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం నాగేందర్‌ ఇంటికి వెళ్లినా దానం ఆయనను కలవకుండా బయటికి వెళ్లిపోవడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెనుదిరిగారారు.కాంగ్రెస్‌ పార్టీకే చెందిన మరో మాజీ మంత్రి ముకేష్ గౌడ్ , ఆయన కుమారుడు కూడా గులాబీ గూటికి చేరాతారని ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆందోళన లో వున్నారు. దీనిపై ఉత్తమ్‌ మాట్లుడుతూ ..నాగేందర్‌ ఇంటికి మధ్యాహ్నం వెళితే ఇంట్లో లేరని…రాత్రికి ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పారని తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్‌ మాట్లాడుతూ పార్టీలో ఉన్న బీసీ నేతలలో తానే పెద్దవాడినని..బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనన్నారు. నాగేందర్‌ పార్టీ వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

శనివారం ఉదయం నాగేందర్‌ ఇంటికి వెళ్లి మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించామని వీహెచ్‌ చెప్పారు. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ పార్టీ వీడుతున్నట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది కానీ…దామోదర రాజనరసింహా అసంతృప్తితో ఉన్నట్లుగానీ, పార్టీ మారుతున్నట్లు గానీ సమాచారం లేదన్నారు. AICC ఈ పరిణామాలతో అత్యవసరంగా పార్టీ సమన్వయకర్తలను రంగంలోకి దించిందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here