మోడీ, జగన్ లను ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయాలి: టిడిపి

విభజన కష్టాలతో ఉన్న రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న బీజేపీకి వంత పాడుతున్న జగన్ ని నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయాలని తెలుగుదేశం ఎంపీలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్‌ను రాజకీయంగా భూస్థాపితం చేయాలని తెలుగుదేశం ఎంపీలు మురళీమోహన్, కేసినేని నాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. ఉద్యమం ఉధృతం కాకముందే.. ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవిలకు ఎంపీలు సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here