హైదరాబాదులో అర్ధరాత్రి దంచి కొట్టిన వర్షం.. రోడ్లన్నీ జల మయం

హైదరాబాద్‌ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం భానుడు ప్రతాపం చూపించాడు. అయితే సాయంత్రానికి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. చిరు జల్లులుగా ప్రారంభమైన వర్షం.. అర్ధరాత్రి సమాయానికి బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, మారెడ్‌పల్లి, అడ్డగుట్ట, బోయిన్‌పల్లి, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, అబిడ్స్‌, లక్డీకాపూల్‌, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నాచారం, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో… ముందస్తుగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఈ సారి నైరుతి రుతుపవనాలు ప్రారంభంలోనే ఆశాజనకంగా కనిపించాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మొదటి రెండ్రోజులు వర్షాలు బాగానే కురిసినా..ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి. నైరుతి రుతుపవనాలు వచ్చినా.. గత వారం రోజులుగా భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో ఏపీలో భానుడి ధాటికి ప్రభుత్వం సెలవులను కూడా ప్రకటించింది. అయితే ఉపరితల ఆవర్తనం వల్ల వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినా…చాలా ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతంగా మారింది.

ఇటు తెలంగాణలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత వాన కురిసింది. వేములవాడ, చందుర్తి, కొనరావుపేట, బోయింపల్లి, వీర్నవల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో భారీ వర్షం పడింది. వేములవాడలో కురిసిన వర్షానికి రాజన్న ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. తొలకరి జల్లులకు విత్తనాలు నాటుకున్న రైతుల్లో ఈ వర్షం ఆనందం నింపింది. అటు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనానికి.. ఆహ్లాదాన్ని పంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here