దీక్షలతో ఉక్కు రాదు తుక్కు రాదు జేసి సంచలన వ్యాఖ్యలు

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంపీ సీఎం రమేష్‌, బీటెక్‌ రవి చేపట్టిన అమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ప్రజాప్రతినిధుల నుంచే కాకుండా జిల్లా ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రజా, యువజన కార్మిక సంఘాల నేతలు మద్దతు తెలిపారు. టీడీపీ నేతల దీక్షకు ఆ పార్టీ ఎంపీలు సంఘీభావం పలికారు.
కడప ఉక్కు దీక్ష వేదికగా జేసీ దివాకర్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. ముందుగా మాట్లాడిన జేసీ… రమేష్‌ దీక్షకు మద్దతు తెలుపుతూనే… ఈ దీక్ష వల్ల వచ్చే లాభమేమీ లేదని తేల్చి చెప్పారు. దీక్షలతో ఉక్కు రాదు తుక్కు రాదు ఉంటూ సెటైర్లు వేశారు. అయితే దీనిపై ఆదినారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీక్షను ప్రోత్సహించి ఏవో నాలుగు మంచి మాటలు మాట్లాడకుండా… ఇలా మాట్లాడడం తగదని ఆది నారాయణ రెడ్డి అన్నారు.

సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్ష నాలుగో రోజుకు చేరడంతో.. వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. అటు కేంద్రం మనసు కరిగి.. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని కోరుతూ.. కడప దర్గాలో మురళీమోహన్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మజార్ల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ప్రార్ధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here