త్వరలో తెలుగుదేశంలోకి చిరంజీవి..?

ప్రజలందరిచేత మోగాస్టార్ చిరంజీవిగా పిలవబడుతున్న కొణిదల శివశంకర ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా మోగల్తూరు నుంచి మొదలైంది. తండ్రి గారిది పెనుగోండ అయిన అమ్మమ్మగారి ఇంట్లో పెరిగిన చిరంజీవి చదువు నిడదవోలు, గురజాల, మంగళగిరి, బాపట్ల, మొగల్తురు లో ప్రాథమిక విద్య ఇంటర్ మీడియట్ ఒంగోలు డిగ్రీ నర్సాపూర్ కాలేజీ లో పూర్తిచేసారు. చదువుకోనే రోజుల్లోనే నటనమీద ఎర్పడ్డ మమకారాన్ని నిజంచేసుకోవడానికి మద్రాసులో ఫిలింఇన్స్టిట్యుట్ లో చేరి నటనలో శిక్షన తీసుకున్నారు. శిక్షణాకాలం పూర్తీ అయ్యాక 1978 లో పునాది రాళ్ళు తో వెండి తెరపై హీరోగా అడుగు పెట్టాడు. అతి తక్కువ కాలంలోనే మంచి నటుడుగా , మంచి డ్యాన్సర్ గా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు. ఖైది సినిమాతో తెలుగు ప్రేక్షకులమదిలో చెరగని ముద్ర వేశాడు. అక్కడ నుంచి చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు కోటాను కోట్ల అభిమానులకు తన నటన మరియు డ్యాన్సులతో ఎంతగానే ప్రభావం చేసాడు. అనంతరం ఎన్నో హిట్ సినిమాలతో దాదాపు 20 ఏళ్ళు.. నెంబర్ వన్ హీరోగా కొనసాగారు.. అనంతరం ప్రజారాజ్యం పార్టీ ని స్థాపించిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిసి… రాజ్య సభ సభ్యుడిగా మంత్రి పదవిని చేపట్టారు.. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన రాజకీయాలవైపు చూడడం మానేశారు.. వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.. కానీ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.. అదే చిరంజీవి తెలుగుదేశం పార్టీ లోకి రావడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అనేక గ్రామాలకు ఎంపీ ఫండ్స్ నుంచి నిధుల ను మంజూరు చేశారు. ఆ నిధుల సాయం తో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర చేత తెప్పించుకుని అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఇదే క్రమంలో చిరంజీవి టైం లో వచ్చిన నిధులను ఏమాత్రం పక్కదోవ పట్టకుండా చంద్రబాబు చేసిన కార్యక్రమాల గురించి కూడా మంత్రి కొల్లు రవీంద్ర చిరంజీవికి తెలియజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి.. మంత్రి కొల్లు రవీంద్రను కూడా ప్రశంసించారు. ఆ రోజు కొల్లు ముందుకు వచ్చి ఇక్కడ వెనుకబడిన వారికి, అవసరం ఉన్న వారికి కమ్యూనిటీ హాల్స్, రోల్డ్ గోల్డ్ జ్యూవెల్లరీ వర్తకులకు, సీసీ రోడ్లు కావాలని ఆ రోజు అడిగారని గుర్తు చేసుకున్న చిరంజీవి . కొల్లు అడగడంతో ఆ రోజు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని నిధులు మంజూరు చేయించానని చిరంజీవి చెప్పారు.

ఈ క్రమంలో ప్రతిపక్షనేత జగన్ కాపులపై కపట ప్రేమ ను చూపిస్తూన్నట్లు అభిప్రాయపడ్డారు కాబట్టి వారి ఓట్లను వైసీపీ వైపు పడేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డగించి చిరంజీవి కాపు ఓటు బ్యాంకు జగన్ వైపు వెళ్లకుండా ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు ఉండేలా రాష్ట్రం అభివృద్ది పడేలా చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ కాపు నాయకులూ కొందరు ఈ నిర్ణయం నిజమైతే… చిరు కి ఏ మాత్రం తమ మద్దతు ఉండదు అని వ్యాఖ్యానిస్తున్నారట.. మరి పుకార్లు ఎంతవరకూ నిజమో చిరంజీవి స్వయంగా చెప్పాల్సి ఉంటుంది.. ఎందుకంటే తమ్ముడు జనసేన పార్టీ పెట్టి.. అధికార పార్టీకి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. యాత్రలు చేస్తున్నారు.. ఓ వైపు బాబాయ్ కి తన మద్దతు అని ఇటీవలే రామ్ చరణ్ బహిరంగంగా ప్రకటించాడు.. ఈ నేపథ్యంలో చిరు పచ్చ కండువా కప్పుకుంటున్నాడు అన్నది ఎంతవరుకూ నిజమో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here