లిఫ్ట్ లో ఇరుకున్న టిడిపి నేతలు… తీవ్ర ఇబ్బంది

విజయవాడ సివిల్‌ సప్లైస్‌ కార్యాలయం లిఫ్ట్‌ మొరాయించడంతో.. అందులో ఇరుక్కుపోయారు టీడీపీ నేతలు. పౌరసరఫరాల శాఖ ఛైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు లిఫ్ట్ ఎక్కారు. కాసపేటికే అది ఆగిపోవడంతో సిబ్బంది ఆందోళన చెందారు. దాదాపు పావుగంట సేపు నేతలు లిఫ్ట్ లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు సెక్యురిటీ సిబ్బంది రంగలోకి దిగి లిఫ్ట్ డోర్లను తెరిచి నేతలను బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here