కర్నూల్ జిల్లాలో ఆర్టీసి బస్సు.. ఆటో ఢీ.. ఏడుగురు మృతి

కర్నూల్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, ఆర్టీసీ బస్సు రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ క్రమంలో భారీ ప్రమాదం జరిగింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా క్షతగాత్రులను కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్నూల్ కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్తులుగా గుర్తించారు. వీరు ఆటోలో మహానంది దర్శనానికి వెళుతున్నట్టు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here