నాదెండ్ల పయనం జనసేన లోకే ….మారుతున్న గుంటూరు రాజకీయం

గుంటూరు రాజకీయాలు మారనున్నాయు. ప్రస్తుత అసెంబ్లీ లోని 17 శాసనసభా స్థానాల్లో పదమూడు తెలుగుదేశం, వైఎస్ ఆర్ సిపి నాలుగు స్థానాలలో ప్రాతినిధ్యం వహించారు. ఐతే ఈసారి భాజపా రంగంలో ఉంది. భాజాపా జనసేనతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకొనే పరిస్థితులు నేడు ఆంధ్రప్రదేశ్ లో లేవు. ఇక పరోక్ష పొత్తులే గత్యంతరం. ఇక జిల్లా లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ప్రధానపోటి ఇప్పుడున్నపరిస్తితులలో తెదేపా వైఎస్ ఆర్ సిపి మధ్యనే ఉంది. ఐతే జనసేన రంగంలోకి అన్ని స్థానాల్లో రంగంలో దిగితే వారికి మాజీ ప్రజారాజ్యం నాయకులు అండగా నిలిచే అవకాశాలు మెండు. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శి గా వున్నారు. ఐతే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కమ్మ రెడ్డి సామాజిక వర్గాల నుంచీ శాసనసభ కు పోటీ చేయగల సమర్ధత ఉన్న రాజకీయనాయకులు పది మంది వరకూ జిల్లాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాన రాజకీయపార్టీలలో 3 లేక 4 స్థానాలకు మించి అభ్యర్దుల మార్పు ఉండేది లేదు. తెదేపాలో ప్రత్తిపాడు నుంచీ రావెలని గుంటూరు నుంచీ మోడుగల ని నరసరాపేట కు స్థానచలనం వంటివి తప్ప పెద్ద మార్పులు ఉండకపోవచ్చు.
కాంగ్రెస్ లో ప్రముఖ నేత మాజీ స్పీకర్ మృదుస్వభావం కలిగిన నాదెండ్ల మనోహర్ కొద్దిరోజుల క్రితం జనసేనాని పవన్ ని కలిసి 30 నిముషాలు మాట్లాడిన విషయం తెలిసిందే. నాదెండ్ల గతంలో 2 పర్యాయాలు తెనాలి శాసనసభా స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఐతే అంతకు పూర్వం నాదెండ్ల మనోహర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో కలిసి రాహుల్ గాంధి ని ఢిల్లీలో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించారు. రాబోయే కాలంలో ఏది జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని పరిస్థితి ఆంధ్ర రాజకీయాల్లో నెలకొని ఉంది.
బలమైన నాయకుల అవసరం ఉన్న జనసేన కు నాదెండ్ల మనోహర్ చేరిక తప్పక మూడు లేదా నాలుగు స్థానాలలో బలాన్నిస్తుందని రాజకీయవర్గాల విశ్లేషణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here