స్మశానంలో రెండు రోజులుగా పాలకొల్లు యమ్ఎల్ ఏ! … ఏమిటో రహస్యం?

గత రెండు రోజులుగా పాలకొల్లు యమ్ఎల్ ఏ నిమ్మల రామానాయుడు పాలకొల్లు లోని హిందూ స్మశానవటిక లో బస చేశారు. కాలకృత్యాలు అక్కడే తీర్చుకొన్నారు. తనిని కలవటానికి వచ్చిన ప్రజలతో అక్కడే మాట్లాడారు. శుక్రవారం రాత్రి అక్కడే నిద్ర కూడా చేశారు. ఇదంతా దేనికోసమో అనేరు. ఇది ప్రజల కోసమే. విషయంలోకి వెళ్తే. హిందూ స్మశానవటిక అభివృద్ధి పనులు వేగవంతం చెయ్యటానికి తను అక్కడే మకాం వేసి పనులు ప్రత్యక్షంగా పర్వవేక్షించారు.
స్మశానవటికలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ,సకాలంలో ప్రజలకు స్మశానవటిక అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఇక్కడ బస చేశానన్నారు. మొక్కలు నాటితే ఇతర పనులు పూర్తయ్యేలోగా పెరిగి మంచి పచని వాతావరణం కనిపిస్తుందన్నారు. పట్టణంలో జరుగుతున్న ఎన్టీఆర్‌ కళాక్షేత్రం, రామగుండం, శంభునిచెరువు ఉద్యానాల వంటి పనుల్లో కూడా పనుల వేగం పెరిగేందుకు అవసరమైతే అక్కడ కూడా బస చేస్తానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here