హీరో ధనుష్ కు ప్రమదం.. తప్పించుకున్న సాయి పల్లవి

సూపర్ స్టార్ రజనికాంత్ అల్లడు.. కోలీవుడ్ హీరో ధనుష్ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డాడు. మారి 2 సినిమా చివరి సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సినిమా కోసం వేసిన సెట్ నుంచి ఓ చెక్క విరిగి ధనుష్ మీద పడడంతో ఆయన చేతికి, కాలిగి గాయాలయ్యాయి. అదే అదే సన్నివేశంలో సాయి పల్లవి కూడా పాల్గొనాల్సి ఉండి.. కానీ పల్లవి కంటే ముందుగా ధనుష్ షాట్ కి హాజరు కావడంతో సాయిపల్లవి ప్రమాదం నుంచి తప్పించుకుంది.. ధనుష్ కి గాయం అయ్యింది.. గాయపడ్డ హీరో ధనుష్ ను ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకునేవరకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. నిర్మాతలు. ఇదిలావుంటే షూటింగ్ లో గాయపడ్డ ధనుష్ అభిమానులను ఉద్దేశించి తనకు ఎటువంటి ప్రమాదం లేదని. అభిమానులు ఖంగారు పడాల్సిన పనిలేదని ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here