ఇసుక రీచ్ ల నిర్వహణ పై చంద్రబాబు కీలక నిర్ణయం…!

రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దేలా సిఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుని అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. ఇందులో భాగంగా ఇక నుంచి ఇసుక రీచ్ ల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వర్చువల్ విధానంలో ఇసుక రీచ్‌లను త‌నిఖీ చేసిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా వ‌ర‌కు ఇసుక అక్రమ రవాణాను రిక‌ట్టామ‌న్నామన్న చంద్రబాబు ఇంకాస్త పకడ్బందిగా ఉండాలన్నారు.అందుకోసం ప్రభుత్వం విప్లవాత్మక విధానాలు అమల్లోకి తెచ్చింద‌న్నారు.

ఇసుక రీచ్‌ల నిర్వ‌హ‌ణ ఎలా ఉంద‌నే దానిపై ప్ర‌జాభిప్రాయాన్ని సేకరించింద‌న్నారు అధిక శాతం మంది ప్రజల్లో చాలా వరకు అక్రమ అరికట్టామనే అభిప్రాయాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు.
సామాన్యుల‌కు ఉచితంగా ఇసుక ల‌భించాల‌ని, వారిపైన ఎలాంటి భారం ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం త‌న‌కు రావాల్సిన రూ.700 కోట్ల మేర ఆదాయాన్ని కూడా వ‌దులుకుంద‌న్నారు.

అక్ర‌మ ఇసుక ర‌వాణాను పూర్తి గా అరికట్టి..ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాలని సూచించారు.ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్నా విపక్షాలు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని,,అ ఆరోప‌ణ‌ల‌కు కూడా తావు లేకుండా చర్య‌లు తీసుకోవాలన్నారు. . ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇసుక సామాన్యుడికి భారం కాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here