ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జిందాల్ సంస్థ వస్తే అడ్డుకున్నది టిడిపి

ఓవైపు కడప గడప లో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టిడిపి ఎంపీ సిఎం రమేష్ దీక్ష.. మరి వైపు తానే ఆ స్టీల్ ప్లాంట్ ని కడతానని.. లేదంటే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని గాలి జనార్ధన్ రెడ్డి వార్నింగ్… ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అసలు స్టీల్ ప్లాంట్ రాలేదని టీడీపీ నాయకులు ఇప్పుడు గొడవ చేస్తున్నారు కానీ.. అసలు వారి వల్లే పరిశ్రమ రాలేదని పవన్ నిప్పులు చెరిగారు. అప్పట్లో దీని నిర్మాణం కోసం జిందాల్ సంస్థ ముందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆయా నాయకులకు లబ్ధి చేకూరితేనే కర్మాగారం ఏర్పాటు కావాలా? లేకపోతే కాకూడదా? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? అని టీడీపీని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here