ఆనంను పార్టీ మారొద్దంటూ బుజ్జగించిన గంటా

తెలుగుదేశం పై అలకవీడిన మంత్రి గంటా శ్రీనివాసరావు… తాజాగా టిడిపి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డిని బుజ్జగించారు. తెలుగు దేశం పార్టీ నుంచి మారొద్దంటూ సూచించారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుందామన్నారు.నెల్లూరుకు వెళ్లిన గంటా శ్రీనివాసరావు.. ఆనం రాంనారాయణ ఇంటికి వెళ్లారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వీరిద్దరి మధ్య మొదటి నుంచి మంచి రిలేషన్ ఉంది. ఆనం వివేకానందారెడ్డి మృతిపై సంతాపం తెలపడానికి వచ్చిన గంటానూ.. రాంనారాయణ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. తనకు వ్యతిరేకంగా స్థానిక నేతలను అధిష్టానం ప్రోత్సహిస్తుండడంపై ఆనం అసంతృప్తి వ్యక్తం చేసి.. తాను త్వరలో టిడిపిని వీడనున్నాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here