ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈనెల 29న జరిగే బంద్ కు జనసేన మద్దతు

విజయవాడలోని జనసేన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పవన్‌తో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటి అయ్యారు.. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… కడప ఉక్కు పరిశ్రమ కోసం ఈ నెల 29న చేపట్టనున్న బంద్‌కు జనసేన మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వామపక్షాలదీ తమదీ ఒకే భావజాలమన్నారు. సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ… కడప ఉక్కు కర్మాగారం కోసం ఈ నెల 29న ప్రతిపక్షాలు నిర్వహించే జిల్లా బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నామని, దానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విభజన హామీల సాధనకు జనసేన, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలన్నీ కలిసి ఉద్యమిస్తాయన్నారు. సెప్టెంబరులో విజయవాడలో నిర్వహించే భారీ ప్రదర్శనలో పవన్ వస్తారని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here