ఆరేళ్ళ బాలుడిపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడి

ఇప్పటి వరకూ అభం శుభం తెలియని చిన్నారులపై కామంతో పైచాచికానికి పాల్పడడం గురించి విన్నాం.. కానీ బాలురు పై కూడా లైంగిక దాడికి దిగడం.. కలకలం రేపుతుంది.. నెల్లూరులో ఆరేళ్ళ బాలుడి పై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.

సుబేదారుపేటలో నివాసమున్న బాబుకు ఆరేళ్ల బాలుడున్నాడు. అయితే నెలరోజులుగా పిల్లాడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. అనుమానంతో తల్లిదండ్రులు నిలదీయగా.. దారుణం వెలుగుచూసింది. గత మూడు నెలలుగా తనపై జరుగుతున్నలైగింక దాడిని బయటపెట్టాడు బాలుడు. తమ ఇంటి కిందే అద్దెకు ఉంటున్న సెకండియర్ స్టూడెంట్‌తో పాటు 17 ఏళ్ల పదవ తరగతి యువకుడు తనపై లైగింక దాడి చేసినట్లు చెప్పాడు బాలుడు. ఈ విషయాన్ని బయటికి చెబితే కొడతామని బెదిరించారని చెప్పాడు.

విషయం తెలిసి బాలుడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అమానుషానికి పాల్పడిన యువకుల పేరెంట్స్ పలుకుబడి కలవారు కావడంతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదంటున్నాడు బాధితుడి తండ్రి. నిందితులకు కఠినంగా శిక్ష పడే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here