నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ‘నేదురుమల్లి’

మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌రెడ్డి రాజకీయ వారసుడు ‘రామ్‌కుమార్‌రెడ్డి’ బిజెపిని వీడి వైకాపాలో చేరాలా..లేక టిడిపిలో చేరాలా..? అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైకాపాలో చేరి ‘వెంకటగిరి’ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ‘ఆనం’ చెప్పడంతో…అప్పటి వరకు వైకాపాలో చేరి అక్కడ నుంచే పోటీ చేయాలని ఆశపడ్డ ‘రామ్‌కుమార్‌రెడ్డి’ షాక్‌ తిని టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వెంకటగిరి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ‘రామ్‌కుమార్‌రెడ్డి’కి ఇవ్వమని…ఆయనకు ‘నెల్లూరు’ పార్లమెంట్‌ సీటు ఇస్తామని టిడిపి పెద్దలు చెప్పారట. ప్రస్తుత పరిస్థితుల్లో ‘నెల్లూరు’ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే..విజయం సాధిస్తానా..లేదా..? అనేదానిపై రామ్‌కుమార్‌రెడ్డి సర్వే చేయించుకుంటున్నారట. బిజెపికి రాజకీయ భవిష్యత్‌ లేదు..వైకాపాలో చేరదామంటే ‘వెంకటగిరి’ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. టిడిపిలో చేరి ‘వెంకటగిరి’ సీటు అడిగితే చంద్రబాబు ఇవ్వరు.

రాజకీయంగా ముందుకువెళదామంటే…టిడిపినే బెటర్‌ అని..గెలిచినా..ఓడినా..రాజకీయంగా ‘చంద్రబాబు’ తనకు ప్రాధాన్యత ఇస్తారని, నెల్లూరులో ‘నేదురమల్లి’ అభిమానులు చాలా మంది ఉన్నారని, వారి కుటుంబ సభ్యుడు ఎంపీగా పోటీ చేస్తే…విజయం సాధిస్తారని…’చంద్రబాబు’కు పలువురు సూచించారట. ఆగస్టు మాసం లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని…టిడిపికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని..అప్పటి వరకు తమ కుటుంబ అభిమానులు వేచి చూడాలని ‘రామ్‌కుమార్‌రెడ్డి’ చెప్పినట్లు తెలుస్తోంది. 2014లో ఎంపీగా స్వేల్ప తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇటీవల చంద్రబాబును కలచి తాను ఎంపీగా మళ్లీ పోటీ చేయనని, వెంకటగిరి, కొవ్వూరు, నెల్లూరు, నెల్లూరు అర్బన్‌లో ఎక్కడ నుంచి పోటీ చేసి అయినా తాను గెలుస్తానని చెప్పారట. ఈ సందర్భంగా…ఎంపీగా ఎవరిని పోటీచేయించాలనే విషయంపై ‘ఆదాల’ రామ్‌కుమార్‌రెడ్డి’ని సూచించారని..తెలుస్తోంది. ఆయనను టిడిపిలో చేర్పించేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, అది నేడో..రేపో కార్యరూపం దాల్చనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here