రానా ఆరోగ్యం పై జాతీయ దిన పత్రిక కథనం …ఏది నిజం..?

గత కొన్ని రోజులుగా రానా ఆరోగ్యం పై అనేక వార్తలు వెలువడుతున్నాయి.. కంటి ఆపరేషన్ అని కొంత సేపు.. లేదు కిడ్నీ ఆపరేషన్ అని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి… ఐతే తన కుమారుడు రానా ఆరోగ్యంగా ఉన్నాడు అని తండ్రి సురేష్ బాబు బహిరంగంగా ఖండించారు.. దీంతో మళ్ళీ కొన్ని రోజులుగా ఆగాయి.. అయితే ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక రానా ఆరోగ్యం పై ఒక షాకింగ్ న్యూస్ ని ప్రచురించింది. ఈ కథనం రానా కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు ఇచ్చిన లీకుల ప్రకారం ప్రచురిస్తున్నట్లు ఆ ప్రముఖ పత్రిక పేర్కొంది.

రానా కు నెక్స్ట్ వీక్ లో కిడ్నీ ట్రాన్స్ ప్లేంటేషన్ కోసం అమెరికా కనీ సింగపూర్ కానీ వెళ్లనున్నట్లు… రానాకు కిడ్నీని అతని తల్లి లక్ష్మి ఇవ్వనున్నట్లు.. ఈ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతున్నట్లు ఆ ఆంగ్ల పత్రిక కథనం.. అయితే కిడ్నీ డోనర్ గా నాగ చైతన్య తల్లి సురేష్ బాబు చెల్లెలు లక్ష్మి పేరు కూడా వినిపిస్తుంది.. ఐతే ఈ వ్యాధి రానాకు వంశపారంపర్యంగా వచ్చిన లక్షణం అని.. డాక్టర్లు చెప్పినల్టు కూడా ఆ కథనం లో ఉంది..
కాగా రానా ప్రస్తుతం హాథి మేరి సాథి సినిమా షూటింగ్ లో పాల్గొనడమే కాదు.. తాను హోస్ట్ చేస్తున్న యారి నెంబర్ వన్ మేకర్స్ ను షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకోమని సూచనలు ఇచ్చిన వార్తలు వస్తున్న నేపథ్యంలో రానా ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.. అయితే ఇప్పటికే ఈ వార్తలను సురేష్ బాబు, రానా ఖండిస్తూ వస్తున్నా ఏదొక కారణం లేకుండా ఇటువంటి వార్తలను జాతీయ మీడియా ప్రచురించదు.. అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here